నిజాంను పొగిడిన రేవంత్, కేసీఆర్‌లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:44 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజాం పాలనను ప్రశంసించిన సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాలను వారం రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తామని, చారిత్రక పోరాట కేంద్రాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): నిజాం పరిపాలనపై పొగడ్తలు గుప్పించిన సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘ఆడపిల్లలను నగ్నంగా బతకమ్మ ఆడించిన దుర్మార్గుడు నిజాం. ఎంతోమందిని చంపి రాక్షసంగా వ్యవహరించిన నీచులు రజాకార్లు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అగ్రనేతలు ఓట్ల కోసం నిజాంను పొగడుతున్నారు. వారికి డీఎన్‌ఏ పరీక్ష చేయాల’న్నారు.
‘బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాలను వారంపాటు గల్లీగల్లీలో అధికారికంగా నిర్వహిస్తాం. పరకాల, గుండ్రాంపల్లి, వీర బైరాన్ పల్లి, నిర్మల్ వెయ్యి ఊడలమర్రిలను స్ఫూర్తి కేంద్రాలుగా మారుస్తామ’ని చెప్పారు. బీఆర్‌ఎస్ కబ్జాచేసిన భూములపై దండయాత్ర చేస్తామని, ఆ భూములను పేదలకు పంచుతామన్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం, బీఆర్‌ఎస్ నేతలిచ్చిన అఫిడవిట్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోఠిలోని వివేకవర్ధని కళాశాలలో బీజేపీ ఆధ్వర్వాన రక్తదాన శిబిరాన్ని సం జయ్ ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబసభ్యులను అరెస్టు చే యడంలో ఉన్న అడ్డంకులేమిటో రేవంత్ స్పష్టం చేయాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
చెక్‌పోస్ట్-పంజాగుట్ట ఎలివేటెడ్ కారిడార్!
కాంగ్రెస్‌ది ‘ప్రజా వంచన’ పాలన