Share News

చంద్రబాబుపై అనిరుధ్‌ వ్యాఖ్యలు అశాస్త్రీయం

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:16 AM

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులకు చంద్రబాబు కారణమనే విధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అశాస్ర్తీయమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విమర్శించారు.

చంద్రబాబుపై అనిరుధ్‌ వ్యాఖ్యలు అశాస్త్రీయం
Anirudh Reddy

వర్షాభావ పరిస్థితులపై ఆయనకు నిపుణులతో

అవగాహన కల్పించాలి : బక్కని నర్సింహులు

తెలంగాణలో వర్షాభావ పరిస్థితులకు చంద్రబాబు కారణమనే విధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అశాస్ర్తీయమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు విమర్శించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడటంతోనే తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో అనిరుధ్‌రెడ్డి వర్షాలు పడకపోవడానికి చంద్రబాబు ప్రభావం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేకు తగవని బక్కని నర్సింహులు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీ వర్షాలు.. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 08:16 AM