ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో దారుణం
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:39 AM
హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్‌పై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
హైదరాబాద్, మార్చి 9: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. డీమార్ట్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద ఆటోడ్రైవర్‌పై యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆటో డ్రైవర్ ఉమర్ తన ఆటోలో కూర్చుని ఉన్న సమయంలో ఇమ్రాన్ అనే యువకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఉమర్ మెడ, చేతులపై గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అవడంతో ఉమర్ అక్కడే కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కారణం ఇదే..
డీమార్ట్ వద్ద ఆటోస్టాండ్‌లో తన ఆటోను పెట్టుకున్నాడు ఉమర్. ఆటో పెట్టినందుకు ‘మామూలు’ ఇవ్వాలని ఇమ్రాన్ డిమాండ్ చేశాడు. ఇందుకు ఉమర్ తిరస్కరించాడు. దీంతో కోపంతో రెచ్చిపోయిన ఇమ్రాన్ తన వద్ద ఉన్న కత్తితో ఉమర్‌పై విచాక్షణారహితంగా దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సెక్షన్ 301 కింద కేసు నమోదు చేసిన దార్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆటోస్టాండ్ వద్ద కత్తితో దాడి ఘటనతో మిగిలిన ఆటో డ్రైవర్‌లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్
ఏపీ లిక్కర్ స్కామ్.. ఆ ముగ్గురికి ఈడీ నోటీసులు
Read Latest Telangana News And Telugu News