అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి
ABN , Publish Date - May 20 , 2026 | 04:22 PM
అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్‌పేట్‌లోని తన ఇంట్లోనే యువతి సేఫ్‌గా ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్, మే 20: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్‌పేట్‌లోని తన ఇంట్లోనే యువతి సేఫ్‌గా ఉన్నట్లు తెలిపారు. ఫోన్ నంబర్ ఆధారంగా యువతిని పోలీసులు గుర్తించారు. అత్తాపూర్ జోయ్ ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి యువతి కిడ్నాప్ అవడం సంచలనం సృష్టించింది. ఓ యువతిని కొందరు వ్యక్తులు థార్ కార్‌లో వచ్చి అందరూ చూస్తుండగానే బలవంతంగా కిడ్నాప్ చేశారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. యువతిని కిడ్నాప్ చేసిన కారును ఛేజ్ చేశారు. అయితే కిడ్నాపర్లు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు. కార్‌కు నంబర్ ప్లేట్ లేకపోవడంతో వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.
జోయ్ హాస్పిటల్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యువతిని కొందరు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కిడ్నాప్‌కు ముందు యువతి ఆస్పత్రి పక్కనే ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్‌కు వెళ్లి అక్కడ కొన్ని వస్తువులను కొనుగోలు చేసి.. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా.. మలక్‌పేటకు చెందిన యువతిగా నిర్ధారించారు. అక్కడకు వెళ్లి చూడగా.. యువతి తన ఇంట్లోనే సేఫ్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి...
నిర్మలా సీతారామన్‌తో భేటీ.. తెలంగాణకు అదనపు ఆర్థిక సాయం కోరిన భట్టి
యువతి కిడ్నాప్ కేసు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు
Read Latest Telangana News And Telugu News