Share News

ఫోర్బ్స్ షోస్టాపర్స్‌లో టాలీవుడ్ జోరు.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌కు చోటు..

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:10 PM

టాలీవుడ్‌ స్టార్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘షోస్టాపర్స్ 2026’ జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు.

ఫోర్బ్స్ షోస్టాపర్స్‌లో టాలీవుడ్ జోరు.. అల్లు అర్జున్, రామ్‌చరణ్‌కు చోటు..
Forbes India Showstoppers 2026

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన షోస్టాపర్స్ 2026 (Forbes India’s Showstoppers 2026) జాబితాలో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్ కల్చర్‌కు చెందిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో ఉన్న ఏకైక తెలుగు సినీ తారలు వీరిద్దరే కావడం విశేషం.


కవర్‌ పేజీపై అల్లు అర్జున్..

‘పుష్ప 2: ది రూల్’తో దేశవ్యాప్తంగా తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న అల్లు అర్జున్‌కు ఈసారి మరో అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ ఇండియా ‘షోస్టాపర్స్ 2026’ ఎడిషన్‌ కవర్‌పై ఆయన మెరిశారు. పుష్పతో మొదలైన ఆయన పాన్‌ ఇండియా ప్రయాణం.. ‘పుష్ప 2’ విజయంతో మరింత విస్తరించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన స్టార్‌ ఇమేజ్‌ నుంచి జాతీయ స్థాయి స్టార్‌గా అల్లు అర్జున్‌ ఎదిగారు.


రామ్‌చరణ్‌కూ చోటు..

మరోవైపు రామ్‌చరణ్‌ కూడా షోస్టాపర్స్ జాబితాలో స్థానం సంపాదించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌లో కీలక భాగమయ్యారు. ప్రస్తుతం ‘పెద్ది’తో పాటు పలు భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో రామ్‌చరణ్‌ సినిమాలపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి నెలకొంది.


బాలీవుడ్‌, సౌత్‌ స్టార్ల హవా..

ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026 జాబితాలో బాలీవుడ్‌ నుంచి షారుఖ్ ఖాన్‌, ప్రియాంక చోప్రా జోనస్‌, రణ్‌వీర్ సింగ్‌ వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. దక్షిణాది నుంచి రజనీకాంత్‌, కమల్ హాసన్‌, దళపతి విజయ్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి వంటి అగ్ర తారలు కూడా షోస్టాపర్స్‌గా నిలిచారు. క్రీడా రంగం నుంచి విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి స్టార్లు కూడా జాబితాలో ఉన్నారు. పాన్‌ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న వేళ.. టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు దేశంలోని అత్యంత ప్రభావశీల సెలబ్రిటీల జాబితాలో నిలవడం తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటిచెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి

రక్షాబంధన్ వేళ తమ్ముడికి కొత్త జీవితమిచ్చిన అక్క.. వీరి ప్రేమ వేరే లెవల్..

అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్.. భారతీయులపై ప్రభావమెంత?

Updated Date - Aug 27 , 2026 | 01:16 PM