తెలంగాణ భవన్ ఆర్సీగా అద్వైత్ కుమార్ సింగ్ బాధ్యతలు
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:54 AM
ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ)గా అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ (ఆర్సీ)గా అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అద్వైత్ కుమార్ సింగ్‌కు తెలంగాణ భవన్ ఆర్సీ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం భవన్ బాధ్యతలతో పాటు కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ విధులను కూడా ఆయన యథావిధిగా కొనసాగించనున్నారు.
ఇవి కూడా చదవండి...
మార్వాడీ వ్యాపారి దారుణ హత్య!
ఎంబీబీఎస్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్’ అవకాశం
17 ఏళ్ల ట్రైనీ నర్స్‌పై హాస్పిటల్ ఎండీ లైంగిక దాడి
Read Latest Telangana News And Telugu News