మదీనగూడలో రామ్‌రాజ్ షోరూం ప్రారంభం
ABN , Publish Date - Oct 12 , 2026 | 06:23 AM
హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మదీనగూడ క్రాంతి వనంలోని అర్యాంక టవర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్‌రాజ్ 66వ షోరూం (బ్రాంచ్) ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
చందానగర్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మదీనగూడ క్రాంతి వనంలోని అర్యాంక టవర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్‌రాజ్ 66వ షోరూం (బ్రాంచ్) ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. సినీ నటుడు శ్రీరామ్ ముఖ్యఅతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జబర్దస్త్ రాకేశ్, రామ్‌రాజ్ సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయలను ప్రతిబింబించే విధంగా రామ్‌రాజ్ వస్త్రాలు ఉంటాయన్నారు. నాణ్యమైన కాటన్‌తో, నిపుణులైన వారితో వస్త్రాలు తయారు చేయిస్తారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ వస్త్రాలకు మంచి పేరుందని కొనియాడారు. ప్రజల జీవన శైలికి అనుగుణంగా కొత్త ట్రెండ్లను ఈ సంస్థ సమాజానికి పరిచయం చేస్తుందని ఆయన అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంలో ఆలేటి రుక్మారెడ్డి మొదటి కొనుగోలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఢిల్లీలో మీకు హక్కులు.. తెలంగాణలో మాకు నిర్బంధాలా?
Read Latest AP News And Telangana News