ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:03 AM
హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్, జూన్ 23: నగరంలో మరోసారి ఏసీబీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాల్లోనూ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్‌లో మొత్తం పదిచోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా మల్లారెడ్డి విధుల్లో చేరారు. ఇటీవల ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయ్యింది. దీంతో ఈరోజు తెల్లవారుజామునే ప్రత్యేక బృందాలు నిజామాబాద్ చేరుకుని.. అక్కడి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఆఫీసులో విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బందిని కూడా విచారించారు. ప్రగతినగర్‌లో మల్లారెడ్డి అద్దెకు ఉంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లభించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
విశాఖ అగ్నిప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్
Read Latest Telangana News And Telugu News