Share News

టీవీ షోకి తీసుకెళ్తామని చెప్పి.. మహిళపై అత్యాచారం..

ABN , Publish Date - Jul 08 , 2026 | 09:29 AM

భర్తతో విభేదాల పరిష్కారం కోసం టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఒక బాధితురాలిని నమ్మించి, సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ఇద్దరు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది..

టీవీ షోకి తీసుకెళ్తామని చెప్పి.. మహిళపై అత్యాచారం..
Hyderabad Crime

రాజన్న సిరిసిల్ల, జులై 8: భర్తతో విభేదాల పరిష్కారం కోసం టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఒక బాధితురాలిని నమ్మించి, సికింద్రాబాద్ రాణిగంజ్‌లో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 43 ఏళ్ల మహిళకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత రెండేళ్లుగా వరకట్న వేధింపుల కారణంగా భర్తతో వివాదాలు నడుస్తుండటంతో ఆమె అతనికి దూరంగా ఉంటోంది. ఇలాంటి కుటుంబ సమస్యలను పరిష్కరించే ఒక ప్రముఖ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొని తన గోడు వెళ్లబోసుకోవాలని ఆమె హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఈ క్రమంలో టీవీ షో నిర్వాహకులు తనకు బాగా తెలుసంటూ ఒక నిందితుడు ఆమెను నమ్మించాడు. సహాయం చేస్తానని నమ్మబలికి, ఆమెను సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని హైదర్ కాంప్లెక్స్‌కు తీసుకువెళ్లాడు.


కాంప్లెక్స్‌కు తీసుకెళ్లిన తర్వాత సదరు వ్యక్తి మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆ తర్వాత అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఊహించని ఈ దారుణంతో షాక్‌కు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన ఘోరంపై బాధితురాలు మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి, నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 08 , 2026 | 10:59 AM