కదులుతున్న రైలు నుంచి పాపను కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 07 , 2026 | 09:42 AM
కదులుతున్న రైలులో ఓ మహిళ మర్చిపోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చేసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో రోజూ ఎన్నో రకాల వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే కొన్ని దృశ్యాలు మాత్రం మన మనసును తీవ్రంగా హత్తుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక అద్భుతమైన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తి చేసిన సాహసం.. నెటిజన్ల ప్రశంసలను అందుకుంటోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో.. ఓ యువతి రైలు దిగి తన బ్యాగును పక్కన పెట్టి కంగారుగా ముందుకు పరిగెత్తడం కనిపిస్తుంది. అదే సమయంలో మరో మహిళ కూడా కదులుతున్న రైలు వైపు అత్యంత ఆందోళనగా పరుగెడుతుంది. తమ పాప రైల్లో ఉండడంతో వారిద్దరూ కంగారుపడిపోతారు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి, ఆ చిన్నారిని సురక్షితంగా కిందకు దించి తల్లికి అందించి, మళ్లీ పరుగెత్తుుంటూ రైల్లు ఎక్కి వెళ్లిపోయాడు.
ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ద్వారా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘బ్రదర్‌కు సెల్యూట్’ అని, ‘మంచి తనం ఇంకా బతికే ఉంది’ అని మరో నెటిజన్ స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భర్తకు 20 నిద్రమాత్రలు ఇచ్చి హత్య.. కేసులో సంచలన విషయాలు..
భార్యను కాపురానికి పిలిచినందుకు ఘోరం.. బావకు నిప్పంటించి చంపిన బావమరిది..