భర్తకు 20 నిద్రమాత్రలు ఇచ్చి హత్య.. కేసులో సంచలన విషయాలు...
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:07 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతి దారుణంగా ప్రాణాలు తీసి బాత్‌రూమ్‌లో పూడ్చిపెట్టిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసు విచారణలో సదరు మహిళ సంచలన విషయాలు వెల్లడించింది.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అతి దారుణంగా ప్రాణాలు తీసి బాత్‌రూమ్‌లో పూడ్చిపెట్టిన ఈ ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసు విచారణలో సదరు మహిళ సంచలన విషయాలు వెల్లడించింది. భర్తను ఏ విధంగా చంపింది, ఎందుకు చంపాల్సి వచ్చిందనే అంశాలను వివరించింది. ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రూబీ శర్మ తన భర్త సురేంద్ర శర్మకు భోజనంలో 15 నుంచి 20 నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఆహారం తీసుకున్న తర్వాత అతడు గాఢ నిద్రలోకి వెళ్లినప్పుడు హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఇంటి బాత్‌రూమ్‌కు ఈడ్చుకెళ్లి అక్కడే దాచిపెట్టింది. అక్కడితో ఆగకుండా మరుసటి రోజే బాత్‌రూమ్‌లో మట్టి వేయించేందుకు కూలీలను పిలిపించింది. మృతదేహం కనిపించకుండా చేసి దానిపై మట్టి పోయించింది. ఆ తర్వాత మేస్త్రీతో సిమెంట్ ఫ్లోరింగ్ చేయించింది. ఈ పని అంతా హత్య జరిగిన ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి చేసింది.
సురేంద్ర శర్మ గురించి అత్తమామలు, బంధువులు, పొరుగువారు అడిగితే 'ఆయన బయటకు వెళ్లారు... త్వరలో వస్తారు' అని చెప్పి అందరినీ నమ్మించింది. మరోవైపు రోజులు గడవడంతో మే 26న తన బావ అనిల్‌తో కలిసి పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు కూడా ఇచ్చింది. పోలీసులతో కలిసి భర్త కోసం వెతుకుతున్నట్లు నటించింది. పొరుగువారి ముందు కన్నీళ్లు పెట్టుకుని అమాయకురాలిలా ప్రవర్తించింది. అయితే సురేంద్ర కుటుంబ సభ్యులకు రూబీ చెప్పిన మాటల్లో పొంతన కనిపించలేదు. ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ప్రశ్నల వర్షం కురిపించడంతో చివరకు రూబీ నేరాన్ని అంగీకరించింది.
సురేంద్ర మద్యం మత్తులో బంధువులతో గొడవపడ్డాడని, కేసులు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. అయితే ఈ హత్య వెనుక ఇదొక్కటే కారణమా? లేక మరేదైనా కోణం ఉందా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 45 రోజుల తర్వాత బాత్‌రూమ్ ఫ్లోర్‌ను పోలీసులు పగులగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరెవరైనా సహకరించారా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ముంబై వర్షాల్లో ట్రాక్‌పై ఉన్న కుక్కను రక్షించిన లోకో పైలట్.. వీడియో వైరల్
భార్యను కాపురానికి పిలిచినందుకు ఘోరం.. బావకు నిప్పంటించి చంపిన బావమరిది..