Drinking water: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. సింగూరు జలాలు బంద్
ABN , Publish Date - Jan 02 , 2026 | 10:26 AM
నగరంలోని కొన్ని ఏరియాలకు సరఫరా చేస్తున్న సింగూనే జలాలను నిలిపివేస్తున్నల్లు సంబంధిత అధికారులు తెలిపారు. పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనుల కారణంగా తాగునీటి సరరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరాలో కీలకమైన సింగూరు జలాలు శనివారం 18గంటల పాటు నిలిచిపోనున్నాయి. సింగూరు ప్రాజెక్టులో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్ -3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో పాటు టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏంఆర్‌టి టెస్టింగ్, హాట్‌లైన్ రిమార్క్‌లతోపాటు సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు. ఈ పనులు శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు చేపట్టనున్నారు. ఆ సమయంలో నగరానికి సింగూరు జలాల సరఫరాను బంద్ చేయనున్నారు.

నగరంలో మలేషియన్ టౌన్‌షిప్, మాదాపూర్, కొండాపూర్(Madhapur, Kondapur), డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్‌బీ కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగం, ఫతేనగర్, గోపాల్‌నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్ మరియు మియాపూర్ సెక్షన్, ప్రగతినగర్ సెక్షన్, మైటాస్, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్ ప్రాంతాలవారు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News