Share News

సనత్‌నగర్‌లో దారుణం.. భార్యపై భర్త దాడి, చికిత్స పొందుతూ మృతి

ABN , Publish Date - May 06 , 2026 | 03:03 PM

సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన భర్త, భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో, ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..

సనత్‌నగర్‌లో దారుణం.. భార్యపై భర్త దాడి, చికిత్స పొందుతూ మృతి
Hyderabad Crime News

హైదరాబాద్, మే 06: నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన భర్త, భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడంతో, ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన చంద్ర భాను, అతని భార్యల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్ర భాను భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.


స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడు చంద్ర భానును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


ఇవి కూడా చదవండి...

శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

నెల్లూరులో మహానాడు పనులకు భూమి పూజ.. పాల్గొన్న మంత్రులు

Updated Date - May 06 , 2026 | 03:58 PM