Share News

హైదరాబాద్‌లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాల చోరీ.. ఆరుగురి అరెస్ట్

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:52 PM

నగరంలో గత కొంత కాలంగా అమాయకుల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముఠా గుట్టును లంగర్‌హౌస్ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాల చోరీ.. ఆరుగురి అరెస్ట్
Hyderabad Gold Theft

హైదరాబాద్, ఆగస్టు 17: నగరంలో గత కొంత కాలంగా అమాయకుల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును లంగర్‌హౌస్ పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదు, వాహనాలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అమాయకులను టార్గెట్ చేసుకొని వారి దృష్టిని మళ్లించి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను అపహరిస్తున్నారు. వరుసగా జరుగుతున్న చోరీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుల కదలికలను గుర్తించారు. ఆధారాలను సేకరించిన అనంతరం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా.. దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సయ్యద్ అసద్, ఒమర్ ఖాన్, సయ్యద్ మొయిన్, అజర్ హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, సయ్యద్ అబ్దుల్ మజీద్ ఉన్నారు.


అరెస్టైన నిందితుల నుంచి మొత్తం 13.5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నాలుగు బంగారు గాజులు, మూడు బంగారు గొలుసులు, ఒక లాకెట్, మూడు ఉంగరాలు ఉన్నాయి. వీటితో పాటు రూ.7.40 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చోరీలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఆటో, ఒక ద్విచక్ర వాహనం, ఆరు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో కొందరిపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో షీటర్ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం

ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 04:13 PM