Share News

హైదరాబాద్‌లో కల్తీ ఆహార కేంద్రాలపై ముమ్మర దాడులు..

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:15 PM

హైదరాబాద్‌లో ఇటీవల కల్తీరాయుళ్లు తమ దందాలు యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ కల్తీగాళ్లపై కమిషనర్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. కల్తీ ఆహార కేంద్రాలపై ముమ్మర దాడులు కొనసాస్తున్నారు.

హైదరాబాద్‌లో కల్తీ ఆహార కేంద్రాలపై ముమ్మర దాడులు..
Food Adulteration

హైదరాబాద్, జులై 19: ఇటీవల కల్తీరాయుళ్లు తమ దందాలు యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ కల్తీగాళ్లపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. కల్తీ ఆహార కేంద్రాలపై ముమ్మర దాడులు కొనసాస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (H-FAST), జీహెచ్‌ఎంసీ అధికారుల సంయుక్త బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై విస్తృతంగా దాడులు నిర్వహించాయి. బహదూర్‌పురా, కిషన్‌బాగ్, మైలార్‌గడ్డ, మల్కాజ్‌గిరి, బేగంబజార్ ప్రాంతాల్లోని రీప్యాకింగ్ యూనిట్లు, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలు, బేకరీలు, కిరాణా దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీ, వాడిన వంట నూనెను మళ్లీ వినియోగించడం, కృత్రిమ రంగులు కలపడం, గడువు ముగిసిన ఉత్పత్తులు విక్రయించడం, నకిలీ బ్రాండ్ల ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఆరు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


నోటీసులు జారీ..

తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో వాడిన వంట నూనె, కృత్రిమ రంగులు, అసురక్షిత ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. FSSAI లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, సరైన లేబులింగ్ లేని ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు నోటీసులు జారీ చేశారు. అనుమానాస్పద ఆహార పదార్థాల నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం సేకరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే ఈ ప్రత్యేక దాడుల ప్రధాన ఉద్దేశమని డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ తెలిపారు. ఆహార కల్తీ, అపరిశుభ్రతకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసి అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్

రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు

For More TG News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 09:16 PM