అప్పుల బాధ తాళలేక కూరగాయల వ్యాపారి ఆత్మహత్య
ABN , Publish Date - Aug 01 , 2026 | 03:02 PM
అప్పుల బాధ తీర్చేందుకు భార్య డబ్బుతో ఇంటికి వస్తుండగా, అంతలోనే భర్త శవమై కనిపించిన హృదయవిదారక సంఘటన మల్లాపూర్‌లో చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారి అప్పుల భారం తట్టుకోలేక కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
హైదరాబాద్, ఆగస్టు 1: నగరంలోని మల్లాపూర్ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో వచ్చిన నష్టాలు, రోజురోజుకూ పెరుగుతున్న అప్పుల భారం తట్టుకోలేక ఓ కూరగాయల వ్యాపారి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ గ్రిల్‌కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
తన భర్త బాధ పడటం చూడలేకపోయిన భార్య.. ఆయనకు ఆర్థికంగా సాయం చేసేందుకు తీవ్రంగా యత్నించింది. డబ్బును సర్దుబాటు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేలోపు ఈ దారుణం జరిగిపోయింది. తన భర్త అప్పుల భారం తట్టుకోలేకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడని నాచారం పోలీస్ స్టేషన్‌లో మృతుని భార్య ఫిర్యాదు చేసింది. చేతికి డబ్బులు అంది భర్త కష్టాలు తీరుతాయనుకున్నలోపే ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
వార్తలు కూడా చదవండి...
పెట్టుబడులకు అత్యంత సురక్షిత రాష్ట్రం తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణలో ‘సర్’ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News