హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ చేతివాటం.. చివరికి ఏమైందంటే?
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:23 AM
హైదరాబాద్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులనే కానిస్టేబుల్ దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్, అక్టోబర్ 31: నగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆ మొబైల్ ఫోన్‌ను భద్రపరచాల్సిన బాధ్యత ఉన్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్.. దానిని తన అక్రమాలకు ఉపయోగించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
సీజ్ చేసిన మొబైల్‌లో ఉన్న ఆన్‌లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించి రూ.1.70 లక్షల నగదును బదిలీ చేశాడు. ఈ మొత్తాన్ని తన బంధువులకు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న వస్తువులను దుర్వినియోగం చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఇదే కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలపైనా కానిస్టేబుల్ కన్నేసినట్లు గుర్తించారు. ఆ బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు సీజ్ చేసిన మొబైల్ ద్వారా రూ.1.70 లక్షలు బదిలీ చేయడం, మరోవైపు స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టడం వంటి ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న వస్తువులనే దుర్వినియోగం చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!
మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు
For More AP News And Telugu News