Commissioner RV Karnan: యజమానులకు ఆఖరి చాన్స్.. ఆ వాహనాలను తొలగిస్తాం
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:49 AM
హైదరాబాద్ మహానగరంలో నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీల్లో రోడ్లపై నిలిపి ఉంచిన పాడైన నిరుపయోగ, శిథిల వాహనాలను యజమానులు తొలగించాలని, లేని పక్షంలో తాము తొలగిస్తామని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.
హైదరాబాద్ సిటీ: నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, బస్తీల్లో రోడ్లపై నిలిపి ఉంచిన పాడైన నిరుపయోగ, శిథిల వాహనాలను యజమానులు తొలగించాలని, లేని పక్షంలో తాము తొలగిస్తామని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(Commissioner RV Karnan) తెలిపారు. డంప్‌యార్డులు, ఖాళీ ప్రదేశాల్లో ఏళ్ల తరబడి భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు (లెగసీ వేస్ట్), రోడ్లపై పడేసిన పాత సోఫాలు, పరుపులు, ఇతర వస్తువులు (బల్క్ గార్బేజ్) కూడా తొలగిస్తామని పేర్కొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో చెత్త, నిర్మాణ రంగ వ్యర్థాలు వేసినందుకు 2025లో 10,752 మందికి రూ.2.34 కోట్ల జరిమానా విధించామని పేర్కొన్నారు. చెత్తకు సంబంధించి పౌరులు జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 040- 2111 1111, వాట్సాప్ నంబర్ 81259 66586కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News