సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ మాయమాటలు.. నటిని కారులో ఎక్కించుకుని..
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:44 AM
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ఒక సినీ నటిని లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వెలుగుచూసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 15: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి, ఒక సినీ నటిని లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వెలుగుచూసింది. ఓ సినిమా క్యాస్టింగ్ ఆర్టిస్ట్ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడంటూ సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఓ నటికి ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. ఓ మంచి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే, షూటింగ్ పూర్తియినప్పటికీ ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని మాత్రం చెల్లించలేదు. డబ్బుల విషయం పక్కన పెడితే, తాజాగా ఒక నిర్మాత కార్యాలయానికి రావాలంటూ ఆ నటికి ఫోన్ చేసి పిలిపించాడు.
సదరు వ్యక్తి మాటలు నమ్మి అతను చెప్పిన చోటికి వెళ్లింది. ఇంకా పెద్ద సినిమాలో మంచి మంచి పాత్రలు ఇప్పిస్తానని, పెద్ద అవకాశాలు వచ్చేలా చేస్తానని ప్రలోభపెడుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడు. ఈ పరిణామంతో షాక్ అయిన సదరు నటి.. క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి...
ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..
Read Latest Telangana News And Telugu News