Share News

వీడిన హైదరాబాద్‌ ఆయుధాల చోరీ మిస్టరీ.. మాజీ మిలిటరీ అధికారి అరెస్ట్..

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:03 AM

హైదరాబాద్‌ బొల్లారం ఆయుధాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. చోరీకి గురైన ఆయుధాలను ఓ ఇంట్లో దాచినట్లు గుర్తించి.. ఈ కేసుతో సంబంధం ఉన్న మాజీ మిలిటరీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి తుపాకులు, మ్యాగజైన్స్, బుల్లెట్స్‌తో పాటు బైనాక్యులర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వీడిన హైదరాబాద్‌ ఆయుధాల చోరీ మిస్టరీ.. మాజీ మిలిటరీ అధికారి అరెస్ట్..
Bollaram Crime News

హైదరాబాద్, సెప్టెంబర్ 11: నగరంలోని బొల్లారం ప్రాంతంలో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. చోరీకి గురైన ఆయుధాలను ఓ ఇంట్లో రహస్యంగా దాచినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ఇంటిపై దాడి చేసి తుపాకులు, మ్యాగజైన్స్, బుల్లెట్స్, బైనాక్యులర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ మిలిటరీ అధికారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ వ్యక్తి గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయుధాల చోరీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఆయుధాలు ఎక్కడి నుంచి చోరీ అయ్యాయి? వాటిని ఎవరికి ఇవ్వాలని భావించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


బొల్లారం ఆయుధాల చోరీ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. తాజాగా.. మాజీ మిలిటరీ అధికారి అరెస్టుతో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పరిశీలిస్తున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడి గత కార్యకలాపాలు, అతడితో సంబంధం ఉన్న వ్యక్తులు, ఆయుధాలను దాచడంలో మరెవరైనా సహకరించారా అనే అంశాలపై కూడా విచారణ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా

హుండీలో భక్తుల కోరికల చిట్టా.. నా కోరిక నెరవేరిస్తే మందు మానేస్తా స్వామీ..!

For More Weather News And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 11:34 AM