హైదరాబాద్ బాలానగర్‌లో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
ABN , Publish Date - Sep 04 , 2026 | 11:47 AM
బాలానగర్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాలనీల్లో పర్యటించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకుని నినాదాలు చేశారు..
హైదరాబాద్, సెప్టెంబర్ 4: నగరంలోని బాలానగర్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాలనీల్లో పర్యటించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకుని నినాదాలు చేశారు. అభివృద్ధి పేరుతో భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి.. ఇప్పుడు కాంగ్రెస్‌పై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు.
బాలానగర్.. ఫతేనగర్ డివిజన్లలో పదేళ్లుగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఉన్నా అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. నాలాలకు రిటైనింగ్ వాల్స్ నిర్మించకపోవడం, పాత వెటర్నరీ ఆస్పత్రి, లైబ్రరీ భవనాలను పునరుద్ధరించకపోవడంపై ప్రశ్నించారు. పాదయాత్రల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు
ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్
For More National News And Telugu News