ఐదు జిల్లాల్లో కరువుకు రేవంత్‌రెడ్డే కారణం
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:06 AM
రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కరువుకు సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతనే కారణమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు.
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు
గజ్వేల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కరువుకు సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థతనే కారణమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో నీళ్లు, కరెంట్ లేక ఎండిపోయిన వరి పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... వరంగల్ జిల్లాలకు ప్రాణాధార అయిన గోదావరి నుంచి దేవాదుల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు 24గంటల పాటు మోటార్లను ప్రభుత్వం ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీళ్లున్నా అక్కడా 9గంటలే మోటార్లను నడిపిస్తున్నారని విమర్శించారు. మూడేళ్లుగా కాళేశ్వరం 2వ టీఎంసీ పనులను ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ పనులు పూర్తి చేస్తే మల్లన్నసాగర్ నిండుకుండలా ఉండేదని, అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు. కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12వేలు అందించాలని, మరో 20రోజుల పాటు పంటలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని, సాగునీటిని అందించి పంటలు ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?
భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!