Share News

Hyderabad: వాటర్‌ పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా గ్రేటర్‌..

ABN , Publish Date - Jan 04 , 2026 | 08:50 AM

హైదరాబాద్ ను వాటర్‌ పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి వాటర్‌బోర్డు ప్రత్యేక కార్యాచరణకు దిగుతున్నట్లు బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రోబోటిక్‌ టెక్నాలజీతో పనిచేసే ‘పొల్యూషన్స్‌ ఐడెంటిఫికేషన్‌ మెషిన్‌’ ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరించనున్నట్లు

Hyderabad: వాటర్‌ పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా గ్రేటర్‌..

- కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఎండీ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: నగరాన్ని వాటర్‌ పొల్యూషన్‌ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దడానికి వాటర్‌బోర్డు ప్రత్యేక కార్యాచరణకు దిగుతున్నట్లు బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి(Board MD Ashok Reddy) వెల్లడించారు. కలుషిత నీటి ఫిర్యాదులను జీరోకు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఖైరతాబాద్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. డివిజన్ల వారీగా కాలం చెల్లిన పైపులైన్ల వివరాలు,


city4.jfif

కలుషిత నీరు నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా పైపు లైన్ల వివరాలను సేకరించాలని, ఆయా ప్రాంతాల్లో పైపులైన్ల పటిష్ఠతను అంచనా వేసి మార్చడానికి రానున్న రెండు నెలల్లో ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రోబోటిక్‌ టెక్నాలజీ(Robotic technology)తో పనిచేసే ‘పొల్యూషన్స్‌ ఐడెంటిఫికేషన్‌ మెషిన్‌’ ద్వారా కలుషిత నీటి సరఫరా, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరించనున్నట్లు వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2026 | 08:50 AM