జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాస్
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:17 AM
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా వెల్లడించింది.
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన
ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పోటీ
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ప్రకటన
జనసేనలోకి కొండా సుస్మిత!?
హైదరాబాద్, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావును జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం జనసేన అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ గడల గతంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా పనిచేశారు. డాక్టర్ గడల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించాలనే ప్రతిపాదనను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాము తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి శంకర్ గౌడ్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. గడల అభ్యర్థిత్వానికి జనసేన చీఫ్ సుముఖుత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాము అధ్యక్ష తన ఖమ్మంలో ఆదివారం జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా పరిషత్, మండల పరిషత్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపైఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో తాళ్లూరి రాము మాట్లాడుతూ.. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాస్ పేరును పార్టీ ఖరారు చేసిందని, మరో పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి పేరును వారం రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. సెప్టెంబరు 13న జనసేన పార్టీ అధ్యర్యంలో జనసేన శంఖారావం నిర్వహించనున్నామని తెలిపారు. గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేను రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేస్తున్నామని, లోక్‌సభ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నామని చెప్పారు.
ఈ వార్తలను కూడా చదవండి
టెక్ వ్యూ 24,600 వద్ద గట్టి పరీక్ష!