కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:27 PM
కామారెడ్డిలో గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి, మార్చి 7: కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని గంటల వ్యవధిలోనే చిన్నారుల మిస్సింగ్ (Missing) కలకలం రేపుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యం అయిన వాళ్ళంతా 10 ఏళ్ల లోపు పిల్లలే. కామారెడ్డి పట్టణంలోని సంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్(9) అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం దాటినా పిల్లలు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. ఆర్బీ నగర్(RB Nagar) కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్లు(Sisters) అదృశ్యం కావడం మరింత భయాందోళనకు గురిచేస్తోంది. సీపాత్(8), అయాత్(7), మరియం(5) అనే ముగ్గురు పిల్లలను వారి తండ్రి ఆటోలో తీసుకువెళ్లి ఒక షాపు వద్ద వదిలిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ వాళ్లు కనిపించకుండా పోయారు. చిన్నారు అదృశ్యంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధిత కుటుంబాల ఇంటికి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి. కామారెడ్డి పట్టణ సీఐ నరహిరి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్ ఆధ్వర్యంలో పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం.. పవన్ స్పందన ఇదే
‘మద్య నిషేధం’ హామీ వెనక నిజమైన స్టోరీ ఇదేనా.. జగన్‌కు లోకేశ్ సూటి ప్రశ్న
Read Latest AP News And Telugu News