Share News

అన్నదాతలు సర్వస్వం కోల్పోయే దుస్థితి: బీవీ రాఘవులు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:12 AM

కరువుపై సమగ్రంగా సర్వే చేసి, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు.

అన్నదాతలు సర్వస్వం కోల్పోయే దుస్థితి: బీవీ రాఘవులు
cpm raghavulu

నల్లగొండ రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కరువుపై సమగ్రంగా సర్వే చేసి, రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నా.. కేవలం 300పై చిలుకు మండలాల్లో మాత్రమే వర్షపాతం తక్కువగా ఉందని వాతావరణ విభాగం పేర్కొనడం వాస్తవ పరిస్థితిని తక్కువ చేసి చూపడమేనని పేర్కొన్నారు. నల్లగొండకు సమీపంలోని చర్లపల్లిలో ఎండిన పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. తదుపరి సీపీఎం నల్లగొండ కార్యాలయంలో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌నినోతో వచ్చిన కరువు వల్ల రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు సర్వస్వం కోల్పోయు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు తాలు మాత్రమే మిగిలిన వరి రైతుల పెట్టుబడి మట్టి పాలైందన్న బీవీ రాఘవులు.. పత్తి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడికి బదులు ఈ ఏడాది ఒకటి, రెండు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నష్ట పరిహారం, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పనులపై కేబినెట్‌ సమావేశంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 05:13 AM