ట్రేడింగ్ యాప్ పేరుతో రూ.72.69 లక్షల టోకరా..
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:35 PM
మెదక్ జిల్లా తూప్రాన్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో కనిపించిన పెట్టుబడి ప్రకటనను నమ్మిన ఓ వ్యక్తి.. వాట్సాప్ గ్రూపులో చేరి నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా ఏకంగా రూ.72.69 లక్షలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా, జులై 28: జిల్లాలోని తూప్రాన్‌లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో వచ్చిన పెట్టుబడి ప్రకటన చూసిన బాధితుడు, అందులోని లింక్ ద్వారా వాట్సాప్ గ్రూపులో చేరాడు. అనంతరం Upstox పేరుతో ఉన్నట్లు కనిపించే నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. యాప్‌లో నకిలీ లాభాలను చూపిస్తూ బాధితుడి విశ్వాసాన్ని సంపాదించిన మోసగాళ్లు.. దశలవారీగా మొత్తం రూ.72.69 లక్షలు పెట్టుబడి పెట్టేలా చేశారు. తర్వాత లాభాలతో పాటు అసలు డబ్బును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా, ముందుగా మరికొంత నగదు చెల్లించాలని నిబంధనలు చెబుతూ మోసగాళ్లు డిమాండ్ చేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు.. వెంటనే NCRPలో ఫిర్యాదు చేశాడు. అలాగే ఈ మోసంపై తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలు, వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపులు, తెలియని యాప్‌ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు
బీఆర్ఎస్ పాలనపై కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
Read Latest AP News And Telugu News