కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో 3 ఏళ్ల వయోపరిమితి పెంపు
ABN , Publish Date - Sep 10 , 2026 | 10:10 AM
పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లకు చేరింది.
కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి 29 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కానిస్టేబుల్, ఎస్ఐ నియామకాలకు వయోపరిమితి మధ్య వ్యత్యాసం తగ్గింది. పోలీస్, ఫైర్ డిపార్ట్‌మెంట్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఈ సడలింపులు వర్తిస్తాయి. ఇప్పటికే పెంచిన 7 ఏళ్లకు అదనంగా మరో 3 ఏళ్లు పెంచడంతో అభ్యర్థులకు ఊరట కలిగింది.
వయోపరిమితి మించిన కారణంగా అర్హత సాధించలేమనే చాలా మంది అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మరోసారి తమ లక్ష్యాన్ని గురిపెట్టి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసు నియామకాలకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తు గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్’ నోటీసులు
Read Latest AP News And Telangana News