భూములు తీసుకుని, రియల్ ఎస్టేట్ చేస్తే చర్యలు తప్పవు: దానం నాగేందర్
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:17 PM
హైదరాబాద్‌కు కంపెనీలను తీసుకురావడమే కాదు.. అవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కంపెనీలకు కేటాయించిన భూములు రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించకుండా కఠినమైన ఆంక్షలు విధించాలని అసెంబ్లీలో కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: అసెంబ్లీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్‌లో కంపెనీలకు కేటాయిస్తున్న భూముల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కంపెనీలకు ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టాలని సూచించారు. కంపెనీలకు భూములు కేటాయించే సమయంలో స్పష్టమైన నిబంధనలు, ఆంక్షలు విధించాలని కోరారు. కేటాయించిన భూములను కంపెనీలు తమ ప్రధాన వ్యాపార కార్యకలాపాలకే వినియోగించేలా పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు.
మరోవైపు టెక్ మహీంద్రా వంటి దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నప్పటికీ.. నగరంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దానం నాగేందర్ అన్నారు. ఇలాంటి కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చి కేవలం కాఫీ తాగి వెళ్లిపోయే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాలని, వాటికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కంపెనీలను ప్రోత్సహించినప్పుడే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడంతో పాటు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ అంశాలపై ఐటీ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని దానం నాగేందర్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పాము విషానికి కొత్త విరుగుడు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News