Share News

Congress: గ్రేటర్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌.. సంస్థాగత నిర్మాణంపై ప్రణాళికలు

ABN , Publish Date - Jan 10 , 2026 | 08:09 AM

త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. అత్యధిక డివిజన్లను కైవసం చేసుకుని గ్రేటర్‏లో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది.

Congress: గ్రేటర్‌పై కాంగ్రెస్‌ ఫోకస్‌.. సంస్థాగత నిర్మాణంపై ప్రణాళికలు

- ఇప్పటికే మూడు డీసీసీలకు అధ్యక్షుల ఖరారు

- త్వరలోనే జిల్లా కమిటీల విస్తరణ

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)లో కాంగ్రెస్‏ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అధిష్టానం చర్యలు చేపడుతోంది. రాబోయే గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా బూత్‌ల నుంచి జిల్లా ప్రాదేశిక కమిటీల వరకు నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే గ్రేటర్‌లోని ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డీసీసీల వారీగా నూతన అధ్యక్షులను ఇటీవల టీపీసీసీ ప్రకటించింది. త్వరలోనే కాంగ్రెస్‌ జిల్లా కమిటీలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.


డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం కసరత్తు చేపట్టిన సందర్భంలోనే పార్టీ కార్యకర్తల నుంచి వివిధ పదవుల కోసం సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌(Secunderabad, Khairatabad) పరిధిలో దరఖాస్తులను ఆహ్వానించింది. ఇటీవల హైదరాబాద్‌ పరిధిలో నేతలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లా కమిటీలను ఖరారు చేసి త్వరలోనే డివిజన్లు, బూత్‌ల వారీగా కమిటీలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.


హైదరాబాద్‌పై పట్టు ఉంటే..

రాష్ట్రానికి గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌ అన్నీ రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. హైదరాబాద్‌పై పట్టు ఉంటే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీపరంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసి, మూడు కమిటీలను నియమించింది. ఆయా కమిటీల ద్వారానే గ్రేటర్‌ పరిధిలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ కూడా మూడు ప్రాదేశిక కమిటీల (డీపీసీ) వైపు మొగ్గు చూపింది. హైదరాబాద్‌ డీసీసీ, సికింద్రాబాద్‌ డీసీసీ(Hyderabad DCC, Secunderabad DCC), ఖైరతాబాద్‌ డీసీసీగా ప్రకటించింది.


గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో డీసీసీ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుండేలా విభజించారు. మరో ఆరు నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో డీసీసీల విస్తరణ, నియోజకవర్గ సమన్వయ, డివిజన్‌ కమిటీలను సత్వరమే ఏర్పాటు చేసేందుకు నేతలు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు.


city3.2.jpg

త్వరలోనే జిల్లా కమిటీల విస్తరణ

నగరంలో ఉన్న మూడు డీసీసీలలో ఖైరతాబాద్‌కు మోతె రోహిత్‌, హైదరాబాద్‌కు సయ్యద్‌ ఖలీద్‌ సైఉల్లా, సికింద్రాబాద్‌కు దీపక్‌ జాన్‌లను నియమించారు. త్వరలోనే ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ల కమిటీలను పూర్తిస్థాయిలో విస్తరించనున్నారు. ముఖ్యంగా కోశాధికారి, ఐదుగురు ఉపాధ్యక్షులు, 20 మంది ప్రధాన కార్యదర్శిలు, 44 మంది కార్యదర్శిలు, ఐదుగురు పార్టీ అధికార ప్రతినిధులు, 15 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌ డీసీసీ విస్తరణ కోసం పార్టీ కార్యకర్తలు,


నేతల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 31 నుంచి ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు స్వీకరణ పూర్తి చేసి డీసీసీ విస్తరణ జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌ డీసీసీ పరిధిలో 44 డివిజన్లు వస్తుండగా, ఖైరతాబాద్‌ డీసీసీ పరిధిలో 47, సికింద్రాబాద్‌ డీసీసీ పరిధిలో 50 డివిజన్ల వరకు వస్తున్నాయి. ఆయా డివిజన్ల ఆధారంగా కమిటీలను కూడా త్వరలో వేయనున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది.


త్వరలోనే జిల్లా కమిటీల విస్తరణ

నగరంలో ఉన్న మూడు డీసీసీలలో ఖైరతాబాద్‌కు మోతె రోహిత్‌, హైదరాబాద్‌కు సయ్యద్‌ ఖలీద్‌ సైఉల్లా, సికింద్రాబాద్‌కు దీపక్‌ జాన్‌లను నియమించారు. త్వరలోనే ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ల కమిటీలను పూర్తిస్థాయిలో విస్తరించనున్నారు. ముఖ్యంగా కోశాధికారి, ఐదుగురు ఉపాధ్యక్షులు, 20 మంది ప్రధాన కార్యదర్శిలు, 44 మంది కార్యదర్శిలు, ఐదుగురు పార్టీ అధికార ప్రతినిధులు, 15 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.


హైదరాబాద్‌ డీసీసీ విస్తరణ కోసం పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 31 నుంచి ప్రారంభమైంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు స్వీకరణ పూర్తి చేసి డీసీసీ విస్తరణ జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌ డీసీసీ పరిధిలో 44 డివిజన్లు వస్తుండగా, ఖైరతాబాద్‌ డీసీసీ పరిధిలో 47, సికింద్రాబాద్‌ డీసీసీ పరిధిలో 50 డివిజన్ల వరకు వస్తున్నాయి. ఆయా డివిజన్ల ఆధారంగా కమిటీలను కూడా త్వరలో వేయనున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రతి ఏటా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌

దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2026 | 08:09 AM