తెలంగాణలో విద్యాభివృద్ధికి ఒప్పందాల కోసమే అమెరికా పర్యటన పెట్టుకున్న సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:37 AM
తెలంగాణలో విద్యాభివృద్ధికి ఒప్పందాల కోసమే అమెరికా పర్యటన పెట్టుకున్న సీఎం రేవంత్
ఆయన పర్యటనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసింది
ప్రధాని మోదీ అనధికారికంగా పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు?
రాహుల్ విషయంలో సీఎం రేవంత్ కమిట్‌మెంట్‌తో ఉన్నారు
కొండా సురేఖ.. నేనూ పెద్ద లీడర్లమే..
పెద్ద లీడర్లు బిడ్డలను కంట్రోల్ చేయాలి
సురేఖ బిడ్డలా నాబిడ్డ మాట్లాడినా తప్పే
పీజేఆర్ వంటి మహా నేతనూ సందర్భాన్ని
బట్టి సస్పెండ్ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన పెట్టుకున్నారని.. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయన పర్యటనను కుట్ర పూరితంగా అడ్డుకుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ అనధికారికంగా పాకిస్థాన్‌కు వెళితే మాట్లాడని బీజేపీ ఎంపీలు.. రేవంత్ అమెరికా పర్యటనపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ కావడం వల్లేఆయన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆరోపించారు. ఈ విషయంపై తెలంగాణ మేధావులు, విద్యార్థులు, ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. సీఎంను అవమానించడం అంటే.. తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. ‘దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని కలిసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన పెట్టుకున్నట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రధాని మోదీ ఎవరికీ చెప్పకుండా.. అనధికారికంగా పాకిస్థాన్‌కు వెళ్లారు. ఆ దేశ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు. దేశ ప్రధాని బెడ్ రూమ్ నుంచి ఆఫీసుకు వెళ్లినా సెక్యూరిటీ చెక్ చేస్తుంది. అలాంటి ప్రొటోకాల్ ఉన్న మోదీ.. కనీసం సమాచారం లేకుండా శత్రు దేశమైన పాకిస్థాన్‌కు ఎలా వెళ్లారు. సీఎం రేవంత్‌ను తప్పు పట్టడం కాదు.. బీజేపీ ఎంపీలు ముందు దీనికి సమాధానం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్‌తో ఉన్నారని తెలిపారు. కలిసి పనిచేద్దాం రమ్ముంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడినా.. సీఎం మాత్రం న్యూట్రల్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించారని కొనియాడారు. తాను, కొండా సురేఖ, కొండా మురళి అందరం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులమేనని జగ్గారెడ్డి తెలిపారు. అయితే, పెద్ద లీడర్లు తమ బిడ్డలను కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. కొండా సుస్మిత పటేల్‌లాగా తన బిడ్డ మాట్లాడినా.. ఇంకా ఎవరి బిడ్డ మాట్లాడినా తప్పేనని స్పష్టంచేశారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి కదా అని అన్నారు. పీ జనార్ధన్‌రెడ్డి వంటి మహానాయకుడినే ఓ సందర్భంలో సస్పెండ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు.
రాహుల్‌గాంధీ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్‌తో ఉన్నారని తెలిపారు. కలిసి పనిచేద్దాం రమ్ముంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడినా.. సీఎం మాత్రం న్యూట్రల్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించారని కొనియాడారు. తాను, కొండా సురేఖ, కొండా మురళి అందరం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులమేనని జగ్గారెడ్డి తెలిపారు. అయితే, పెద్ద లీడర్లు తమ బిడ్డలను కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. కొండా సుస్మిత పటేల్‌లాగా తన బిడ్డ మాట్లాడినా.. ఇంకా ఎవరి బిడ్డ మాట్లాడినా తప్పేనని స్పష్టంచేశారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి కదా అని అన్నారు. పీ జనార్ధన్‌రెడ్డి వంటి మహానాయకుడినే ఓ సందర్భంలో సస్పెండ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు