Share News

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు

ABN , Publish Date - Sep 20 , 2026 | 06:45 PM

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో హెచ్.ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ నిపుణుడు డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పారిశ్రామిక సంబంధాల బలోపేతం, యువత నైపుణ్యాభివృద్ధి, విద్య , పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం,..

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో హెచ్.ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ నిపుణుడు డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పారిశ్రామిక సంబంధాల బలోపేతం, యువత నైపుణ్యాభివృద్ధి, విద్య , పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం, మహిళల ఉపాధి భాగస్వామ్యం పెంపు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి పలు కీలక అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. తన వృత్తిపరమైన ప్రయాణంలో మయూర్ పంచాల్, ప్రశాంత్ ఖాలేల మార్గదర్శకత్వం, నాయకత్వ దృక్పథం తనపై ఎంతో ప్రభావం చూపాయని డాక్టర్ కుమార్ రాజా ఈ సందర్భంగా పేర్కొన్నారు. యాజమాన్యాలు, ఉద్యోగులు, కార్మిక సంఘాల మధ్య సామరస్యపూర్వక పారిశ్రామిక సంబంధాలను పెంపొందిస్తూ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడంలో చూపుతున్న ప్రతిభకుగాను ఆయన రెండు రాష్ట్రాల పారిశ్రామిక వర్గాల నుంచి విశేష ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ కుమార్ రాజా చిట్టూరికి 'ఇండిపెండెంట్ కన్సిలియేటర్'గా ప్రత్యేక గుర్తింపు లభించింది.


తాను ఎంబీఏ-హెచ్.ఆర్, ఎల్.ఎల్.బి, యూజీసీ నెట్-జేఆర్‌ఎఫ్‌తో పాటు హెచ్.ఆర్ , ఐ.ఆర్ లో పీహెచ్‌డీ పూర్తి చేసి మానవ వనరుల నిర్వహణ, కార్మిక చట్టాలపై ప్రత్యేక పట్టు సాధించినట్లు తెలిపారు. 'సీహెచ్‌ఆర్‌ఓ ఆఫ్ ది ఇయర్ – 2025', 'ఇండియన్ అచీవర్స్ అవార్డ్' అందుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కు తెలియజేయక అయిన అభినందన తెలిపారు. అదే సమయంలో యువతల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తో పాటు యో పారిశ్రామిక వేతాలను ప్రోత్సహిస్తుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు వర్ష సూచన.. వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

కేసీఆర్ కుటుంబ సభ్యుల భూముల విచారణపై కట్టుబడి ఉన్నాం: మహేశ్ గౌడ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 10:08 PM