Share News

మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:49 PM

పార్టీలు వేరైనా.. ప్రజలకు మంచి చేస్తున్న బీఆర్ఎస్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుపై బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, రాకేష్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవను ఎమ్మెల్యేలు కొనియాడారు.

మంత్రి తుమ్మలపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు
Tummala Nageswara Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 10: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పనితీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు పాయల శంకర్, రాకేష్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మంత్రిగా తుమ్మల చాలా బాగా పనిచేస్తున్నారని.. తాము ఇలాంటి మంత్రిని చూడలేదని పేర్కొన్నారు. ఎప్పుడైనా ఫోన్ చేసినా తుమ్మల స్పందిస్తారని.. ఆదివారం రోజున కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. పనిలో ఉన్న సమయంలో ఫోన్ ఎత్తలేకపోయినా తిరిగి కాల్ చేసి మాట్లాడతారని చెప్పారు. పార్టీలు వేరైనా ప్రజలకు మంచి చేస్తే మంచి అని చెప్పాల్సిందేనని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


ఏదైనా సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఓపికగా విని.. దాని పరిష్కారం కోసం ఫాలోఅప్ చేస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకూ సంబంధిత అధికారులతో మాట్లాడటంతో పాటు.. మళ్లీ ఫోన్ చేసి పరిస్థితిని వివరిస్తారని చెప్పారు. ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతుందో కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు, తోటి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

దళితులు ధర్నా చేసిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడమా?

స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కుల దురహంకార వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 02:12 PM