మజ్లిస్‌లో ధిక్కార స్వరం.. రాజీనామాకు ఎమ్మెల్సీ రహ్మత్ ససేమిరా
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:32 PM
రహ్మత్ బేగ్ వ్యవహారం మజ్లిస్ పార్టీకి తలనొప్పిలా మారింది. ఓ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రహ్మత్ బేగ్‌ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మజ్లిస్ అధిష్ఠానం ఆదేశించింది. కానీ, మూడు రోజులైనా ఆయన రాజీనామా చేయలేదు.
ఎమ్‌ఐఎమ్ పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఓవైసీ ఆదేశించినా రహ్మత్ బేగ్ ససేమిరా అంటున్నారు. దీంతో మజ్లిస్ పార్టీ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటోంది.
హైదరాబాద్: రహ్మత్ బేగ్ వ్యవహారం మజ్లిస్ పార్టీకి తలనొప్పిలా మారింది. ఓ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రహ్మత్ బేగ్‌ను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని మజ్లిస్ అధిష్ఠానం ఆదేశించింది. కానీ, మూడు రోజులైనా ఆయన రాజీనామా చేయలేదు. పైగా.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనంటూ ధిక్కార స్వరం వినిపించడం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.
మజ్లిస్ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్.. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. అయితే పరారీలో ఉన్న రహ్మత్ బేగ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
స్పందించిన ఎమ్మెల్సీ..
మజ్లిస్ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించారు. ‘నేను ఏ తప్పూ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని రహ్మత్ బేగ్ అన్నారు. ఫేక్ వీడియోలను సృష్టించి తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. ఈ విషయమై ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్: టోర్నీ నుంచి జకోవిచ్ ఔట్.. కోర్టులోనే కన్నీళ్లు!
శ్రేయస్‌కు బ్యాకప్‌గా తిలక్ వర్మ!.. గంభీర్, అగార్కర్ ప్లాన్ అదేనా?