Share News

అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ కూతుళ్ల దుర్మరణం

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:47 AM

నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామ శివారులో గురువారం రాత్రి రోగిని హైదరాబాద్‌కు తరలిస్తున్న అంబులెన్స్‌ను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తల్లి, కుమార్తె మృతి చెందారు.

అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ.. తల్లీ కూతుళ్ల దుర్మరణం
Nirmal accident

  • నలుగురికి తీవ్ర గాయాలు..

  • నిర్మల్‌ జిల్లా కడ్తాల్‌లో ఘటన

సోన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామ శివారులో గురువారం రాత్రి రోగిని హైదరాబాద్‌కు తరలిస్తున్న అంబులెన్స్‌ను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా గాదిగూడకు చెందిన మెస్రం సరస్వతి(22) అనారోగ్యంతో ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రిఫర్‌ చేశారు. ఐటీడీఏ ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో సరస్వతిని తీసుకొని కుటుంబ సభ్యులు ఈ నెల 22న రాత్రి ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.


సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామ శివారుకు చేరుకోగానే, అతివేగంగా రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సరస్వతి, ఆమె తల్లి మెస్రం పారుబాయి(55) గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ కనక సాయికిరణ్‌తో పాటు సరస్వతి కుటుంబ సభ్యులు కనక గీత, తూమురం శైలు, మెస్రం సోము తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సోన్‌ ఎస్‌ఐ గోపి తెలిపారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 06:47 AM