Share News

మంచిర్యాలలో పంట కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతి..

ABN , Publish Date - May 06 , 2026 | 06:31 AM

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతిచెందగా.. మరో రైతుకి తీవ్రగాయాలు అయ్యాయి.

మంచిర్యాలలో పంట కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతి..

మంచిర్యాల: లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి నలుగురు రైతులు మృతిచెందగా.. మరో రైతుకి తీవ్రగాయాలు అయ్యాయి. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అక్కడికి వెళ్లారు. అయితే, భారీ ఈదురుగాలులకు కల్లాల సమీపంలోని ఫంక్షన్ హాల్ గోడలు కూలాయి.


ఈ ప్రమాదంలో నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు మృతిచెందారు. సీదుల హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడు తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు మృతిచెందడంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అవుతోంది. మరోవైపు భారీ ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. పలు కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిచిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ నిలుపుదల

మక్కలతోపాటు జొన్నలూ

Updated Date - May 06 , 2026 | 06:47 AM