గుడిని తలపించేలా..!
ABN , Publish Date - May 06 , 2026 | 06:27 AM
మీరు చూస్తున్నది గుడి అనుకుంటే పొరబడినట్లే! ఆహ్లాదకర వాతావరణంలో అచ్చం గుడి గోపురాన్ని తలపిస్తున్న ఈ నిర్మాణం.. ఏలూరు రైల్వే స్టేషన్ ముఖద్వారం అంటే నమ్మక తప్పదు!
ఏలూరు రైల్వే స్టేషన్‌కు కొత్త శోభ
మీరు చూస్తున్నది గుడి అనుకుంటే పొరబడినట్లే! ఆహ్లాదకర వాతావరణంలో అచ్చం గుడి గోపురాన్ని తలపిస్తున్న ఈ నిర్మాణం.. ఏలూరు రైల్వే స్టేషన్ ముఖద్వారం అంటే నమ్మక తప్పదు! అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైల్వేస్టేషన్‌ను కోట్లాది రూపాయలతో ఆధునికీకరిస్తున్నారు. ఇందులోభాగంగా.. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను ప్రతిబింబించేలా రూపొందించారు. ఇక స్టేషన్ లోపల గోడలపై రూపొందించిన ప్రత్యేక చిత్రాలు ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. ఆధునిక సదుపాయాలు, విశాలమైనా వెయిటింగ్ హాల్స్, లిప్టులు, పార్కింగ్, మెరుగైన లైటింగ్‌తో చిన్న తిరుపతి వైభవాన్ని గుర్తుచేసేలా ఏలూరు రైల్వే స్టేషన్‌కు కొత్త శోభ వచ్చింది.
- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ (ఏలూరు)