తెలంగాణలో భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి.. జనసేన డిమాండ్
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:02 PM
తెలంగాణలో 22A భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. వారి సమస్యలకు పరిష్కారం చూపాలంటూ జనసేన ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 4: 22ఏ నిషేధిత భూముల అంశంపై జనసేన ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. 22A జాబితాలో భూములు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులతో కలిసి జనసైనికులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడంతో పాటు.. భూముల రికార్డుల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పారదర్శకంగా పరిష్కరించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. 22A భూముల సమస్యకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన అధికారులపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూముల యజమానుల సమస్యలను ప్రభుత్వం నేరుగా విని.. ప్రతి కేసును పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. 22A జాబితాలో ఉన్న భూములపై స్పష్టమైన విధానం ప్రకటించి.. అర్హులైన భూ యజమానులకు హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద జరిగిన నిరసన దీక్షకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, 22A బాధితులు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 22A భూముల అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని.. బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఘాటెక్కిన ఉల్లి.. నెల రోజుల్లోనే ఆకాశాన్నంటిన ధరలు
పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది
Read Latest AP News And Telangana News And International News And Telugu News