Share News

22-ఎ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Oct 03 , 2026 | 02:00 PM

భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన 22-ఎ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. నాలా అనుమతులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌కు నోచుకోని అర్హత ఉన్న పట్టా భూములకు తాజాగా మార్గం సుగమం చేసింది. వివరాల్లోకి వెళితే..

22-ఎ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్
22A Land Registrations

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణలో భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. నాలా (NALA) అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు. మెమో నెం. 48062/ULC/A1/2026 ద్వారా జారీ అయిన ఈ ఉత్తర్వుల ద్వారా.. నాలా రుసుము చెల్లించి అర్హత ఉన్న భూములను రిజిస్టర్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఇప్పటికే జీవో 118, జీవో 76, ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు పలు ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న 22-ఎ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతినిచ్చారు.


ఈ నిర్ణయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి చిత్తశుద్ధితో అమలు చేయాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ (ULC), నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంస్కరణల అమలుపై రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని.. అర్హులైన దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణీత కాలపరిమితిలోగా సేవలు అందించాలని ఆయన తేల్చిచెప్పారు.


ఇవి కూడా చదవండి..

హనుమాన్‌ చాలీసా చదివి ధైర్యం తెచ్చుకున్నా..

చంపేస్తున్న‘సెకండ్‌ స్మోకింగ్‌’

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 03 , 2026 | 02:16 PM