జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఆఫర్లు ఇవే..
ABN , Publish Date - Aug 08 , 2026 | 05:02 PM
టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జియో ఓటీటీ-పాస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జియో ఓటీటీ-పాస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కొత్తగా త్రైమాసిక, వార్షిక వ్యాలిడిటీ ప్లాన్లనూ జియో అధికారికంగా లాంచ్ చేసింది.
కొత్త ప్లాన్లు ఇవే..
ఇందులో భాగంగా జియో రూ.200 ఓటీటీ పాస్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుంది. ప్రైమ్ వీడియో మొబైల్, ఓటీటీలు కూడా పొందొచ్చు. వాయిస్-ఓన్లీ ప్యాక్‌లు మినహా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. అలాగే, రూ.550తో కొత్త ఓటీటీ పాస్‌ని తీసుకొచ్చింది. రూ.550 రీఛార్జ్‌తో 84 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీతో 90 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ లైట్, ఓటీటీలను కూడా ఈ పాస్ ద్వారా వినియోగించుకోవచ్చు. 3 నెలలు లేదా ఏడాది బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. మరోవైపు, రూ.2,000తో మరో కొత్త ఓటీటీ పాస్‌ని జియో అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఏడాది పాటు నిరంతరాయ సేవలను పొందొచ్చు. 365 జీబీ హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ లభిస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లైట్, ఓటీటీలను చూడొచ్చు. అయితే, ఏడాది బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే ఈ పాస్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఓటీటీ-పాస్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా ప్రతినెలా వినియోగదారులకు దాదాపు రూ.1,500 విలువైన ప్రయోజనాలు దక్కనున్నాయని జియో తెలిపింది. ఇందులో 15 ప్రీమియం ఓటీటీ యాప్‌లతో పాటు జియోటీవీ యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించినట్లు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు.. సానుకూలంగా ప్రభుత్వ రెండో దఫా చర్చలు
శిరోమణి అకాలీ దళ్ సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటిస్తూ..