Meta Layoffs : 1500 మంది ఉద్యోగులపై 'మెటా' వేటు
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:19 PM
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా.. తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పనిచేస్తున్న 1500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ విభాగం కొన్నేళ్లుగా బిలియన్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తోంది. దీంతో ఏఐలో వేగంగా రాబడి వచ్చే అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 13: ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా ప్లాట్‌ఫామ్స్ ఈ ఏడాది(2026)లో తన రియాలిటీ ల్యాబ్స్ (Reality Labs) విభాగంలో సుమారు పదిహేను వందల ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ సంఖ్య రియాలిటీ ల్యాబ్స్ విభాగంలోని ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు 15,000 మంది ఉద్యోగులలో పది శాతానికి సమానం. ఈ కోతలు VR(వర్చువల్ రియాలిటీ), AR(ఆగ్మెంటెడ్ రియాలిటీ), మెటావర్స్ ప్రాజెక్టులపై పనిచేసే ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి. ఈ కోతలు మెటా మొత్తం 78,000 మంది ఉద్యోగులలో చిన్న భాగమే అయినప్పటికీ.. మెటావర్స్ ఉద్యోగుల ఆశలపై పెద్ద ప్రభావం చూపే అవకాశముంది. దీంతో మెటా సంస్థ AI దిశగా బలమైన అడుగులు వేస్తున్న సంకేతాలుగా దీనిని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మెటా CTO ఆండ్రూ బోస్‌వర్త్(Andrew Bosworth) రియాలిటీ ల్యాబ్స్ విభాగ ఉద్యోగులను 2026 జనవరి 14న ఆల్-హ్యాండ్స్ మీటింగ్‌కు పిలిచారు. సాధారణంగా రిమోట్ వర్క్ అనుమతించే విభాగంలో ఇది అరుదు. అంతేకాదు.. ఈ సమావేశానికి అందరూ పర్సనల్‌గా హాజరుకావాలని ఆదేశించారు. ఈ సమావేశం ఉద్యోగ కోతల ప్రకటన తర్వాత జరుగుతుండటంతో అందరిలోనూ ఆసక్తి రేగుతోంది.
ఈ సమావేశంలో రియాలిటీ ల్యాబ్స్ విభాగ భవిష్యత్తు దిశను చర్చించే అవకాశముందని పలువురు అంటున్నారు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలో మెటా.. మెటావర్స్ మీద దృష్టి తగ్గించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), జనరేటివ్ AI మోడల్స్, పెద్ద డేటా సెంటర్ల విస్తరణ వైపు టర్న్ తీసుకుంటోంది. రియాలిటీ ల్యాబ్స్ గత కొన్నేళ్లుగా బిలియన్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తోంది(Quest హెడ్‌సెట్స్, హారిజాన్ వరల్డ్స్, రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్ వంటివి ఉన్నప్పటికీ). దీంతో AIలో వేగంగా రాబడి వచ్చే అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మెటా కంప్యూట్ ఇనిషియేటివ్ కింద 'టెన్స్ ఆఫ్ గిగావాట్స్' కంప్యూటింగ్ పవర్‌తో ఈ సంస్థ భారీ డేటా సెంటర్లు నిర్మిస్తోంది. ఇది AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తుంది. ఈ మార్పులు మెటా భవిష్యత్ వృద్ధికి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అని జుకర్‌బర్గ్ అంటున్నారు.
ఇవీ చదవండి:
టీసీఎస్ లాభం రూ.10,657 కోట్లు