Share News

HCL Tech Quarterly Results: తగ్గిన హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:51 AM

హెచ్‌సీఎల్‌ టెక్‌పై కూడా కొత్త కార్మిక చట్టాల ప్రభావం పడింది. ఫలితంగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ లాభం 11.2% క్షీణించి రూ.4,076 కోట్లకు పడిపోయింది...

HCL Tech Quarterly Results: తగ్గిన హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్‌పై కూడా కొత్త కార్మిక చట్టాల ప్రభావం పడింది. ఫలితంగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ లాభం 11.2% క్షీణించి రూ.4,076 కోట్లకు పడిపోయింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.4,591 కోట్లు. కొత్త చట్టాల కారణంగా పడిన బాధ్యతల కోసం కంపెనీ రూ.719 కోట్లు ఏకకాల కేటాయింపు చేసింది. కంపెనీ ఆదాయం మాత్రం 13.3% వృద్ధితో రూ.29,890 కోట్ల నుంచి రూ.33,872 కోట్లకు పెరిగింది. సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చినా కంపెనీ ఆదాయం 6ు పెరిగినప్పటికీ లాభం మాత్రం 3.7% తగ్గింది. త్రైమాసికాదాయాలు బలంగా ఉండడంతో వార్షికాదాయం 1,500 కోట్ల డాలర్ల స్థాయిని దాటిందని కంపెనీ సీఈఓ, ఎండీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. కొత్త బుకింగ్స్‌ కూడా అసాధారణంగా 300 కోట్ల డాలర్లున్నట్టు కంపెనీ తెలిపింది. డిసెంబరు చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379గా ఉంది.

రూ.12 డివిడెండ్‌: 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌సీఎల్‌ టెక్‌ వాటాదారులందరికీ రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌కు అర్హత సాధించేందుకు రికార్డు తేదీని జనవరి 16గా కంపెనీ నిర్ణయించింది. అర్హులైన వాటాదారులందరికీ ఈ నెల 27వ తేదీన డివిడెండ్‌ను చెల్లించనుంది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 06:56 AM