Share News

ఇక మీకు అన్‌నోన్ కాల్స్ రావు.. నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీని తప్పనిసరి చేసిన కేంద్రం

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:27 PM

ఇకపై అన్‌నోన్ నంబర్ల నుంచి ఎవరికీ కాల్స్ రావు. ఎందుకంటే వినియోగదారుల కాలర్ ఐడీలను తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రం టెలికాం కంపెనీలను ఆదేశించింది.

ఇక మీకు అన్‌నోన్ కాల్స్ రావు.. నవంబర్ 1 నుంచి కాలర్ ఐడీని తప్పనిసరి చేసిన కేంద్రం
CNAP

ఇంటర్నెట్ డెస్క్: ఇకపై అన్‌నోన్ నంబర్ల నుంచి ఎవరికీ కాల్స్ రావు. ఎందుకంటే వినియోగదారుల కాలర్ ఐడీలను తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రం టెలికాం కంపెనీలను ఆదేశించింది. నవంబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాలని నిర్దేశించింది. ఇకపై కాల్ చేసిన వ్యక్తి పేరును టెలికాం కంపెనీలు తప్పనిసరిగా ప్రదర్శించనున్నాయి. దీన్నే సీఎన్ఏపీ (Calling Name Presentation) అని అంటారు. అయితే తొలుత 4జీ, 5జీ నెటవర్క్‌లను వినియోగిస్తున్న వారికే సీఎన్ఏపీ అందుబాటులో ఉండనుంది. ఇతర నెటవర్క్‌ల (2జీ/3జీ) వినియోగదారులకు ఇది అందుబాటులో ఉండదు.


కాగా ఈ సీఎన్ఏపీ ఎలా పనిచేస్తుందో టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ వివరించింది. ఇకపై కాల్ చేయగానే వినియోగదారుడి నంబర్ మొదటి వరుసలో, పేరు రెండో వరుసలో కనిపిస్తాయి. ఆ వ్యక్తి పేరు అప్పటికే మీ కాంటాక్ట్ లిస్టులో ఉంటే అదే కనిపిస్తుంది. ఒకవేళ కాంటాక్ట్స్‌లో పేరు లేకపోతే టెలికాం కంపెనీల్లోని వినియోగదారుల డేటా ఆధారంగా కాలర్ ఐడీ ప్రదర్శిస్తారు. అంటే సిమ్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు కనిపిస్తుంది.

అయితే విదేశాల నుంచి వచ్చే కాల్స్‌‌కు సంబంధించిన డేటా ఉండదు కాబట్టి.. అక్కడ కాలర్ ఐడీకి బదులు ‘అంతర్జాతీయ కాల్’ అని టెలికాం కంపెనీలు ప్రదర్శిస్తాయి. కాగా కేంద్రం జారీ చేసిన ఈ ఆదేశాలను టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) కూడా ఆమోదించింది.


ఈ వార్తలూ చదవండి

రికార్డు దిశగా గ్లోబల్ స్పేస్ మార్కెట్.. 2026లో 100 బిలియన్ డాలర్లు దాటనున్న పెట్టుబడులు

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇక ఫొటోలు, మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!

Updated Date - Oct 15 , 2026 | 12:34 PM