బెల్జియం క్రికెట్ లీగ్.. ఆ క్రికెట్ జట్టుకు సహ యాజమానిగా జహీర్ ఖాన్
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:06 PM
యూరప్ క్రికెట్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. ఈయూటీ20 బెల్జియం క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టుకు సహ యజమానిగా చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్: యూరప్ క్రికెట్ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. ఈయూటీ20 బెల్జియం క్రికెట్ లీగ్‌లో భాగమయ్యాడు. ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టుకు సహ యజమానిగా చేరాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. కాగా ఈ క్రికెట్ లీగ్ జూన్ 4 నుంచి 14 వరకు బ్రస్సెల్స్‌లో జరగనుంది. ప్లేయర్‌గా భారత్‌కు విశేష సేవలందించిన జహీర్.. ఇప్పుడు యూరప్‌లో క్రికెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలు చేపట్టాడు.
‘యూరప్ క్రికెట్ ఒక పెద్ద వేదిక. ఇక్కడ సాధ్యమయ్యే వాటికి ఇది కేవలం ఆరంభం మాత్రమేనని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టుకు సహ యజమానిగా ఉండటం కేవలం ఓ వ్యాపార ప్రతిపాదన మాత్రమే కాదు. ఆటగాళ్లలోని ప్రతిభను కనుగొని, వారు పూర్తి సామర్థ్యంతో రాణించడానికి అవసరమైన వేదికను అందించడమే నా లక్ష్యం. జూన్‌లో బ్రస్సెల్స్‌లో ఉండి పనులు ప్రారంభించడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని జహీర్ ఖాన్ అన్నాడు.
‘జహీర్ ఖాన్ వంటి లెజెండ్ మా జట్టులో భాగం అవ్వడం గొప్ప విషయం. ఆంట్వైర్ప్ యాంకర్స్ జట్టు అతడి వల్ల ప్రత్యేకంగా నిలుస్తుంది. క్రికెట్‌లో జహీర్ ఖాన్ ఓ దిగ్గజం, విజేత. అతడి భాగస్వామ్యం ఫ్రాంచైజీ, యూరోపియన్ క్రికెట్ సమాజం అభివృద్ధికి కీలకం కానుంది’ అని ఆంట్వైర్వ్ యాంకర్స్ యజమాని నాగేంద్ర సిద్దౌతమ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం
అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్