Share News

చాంపియన్లు సులువుగా..

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:41 AM

డిఫెండింగ్‌ చాంపియన్లు కార్లోస్‌ అల్కారజ్‌, అర్యానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరారు. అయితే మూడో సీడ్‌ అలియాసిమెకు రెండో రౌండ్‌లో చుక్కెదురైంది.

చాంపియన్లు సులువుగా..

మూడో రౌండ్‌లో అల్కారజ్‌, సబలెంక

న్యూయార్క్‌: డిఫెండింగ్‌ చాంపియన్లు కార్లోస్‌ అల్కారజ్‌, అర్యానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరారు. అయితే మూడో సీడ్‌ అలియాసిమెకు రెండో రౌండ్‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ అల్కారజ్‌ తొలి సెట్‌ కోల్పోయినా పుంజుకొని 4-6, 6-0, 6-3, 6-2తో ప్రపంచ 72వ ర్యాంకర్‌ జెమీ ఫరియా (పోర్చుగల్‌)ను ఓడించాడు. అన్‌సీడెడ్‌ ఖచనోవ్‌ 6-7(7), 6-3, 6-2, 6-2తో అలియాసిమెకి షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌, రెండుసార్లు డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్యాన సబలెంక 6-1, 6-1తో పోలినాను వరుస సెట్లలో చిత్తు చేసి మూడో రౌండ్‌కు చేరింది. అలాగే ఆరో సీడ్‌ నొస్కోవా, ఏడో సీడ్‌ మ్యుచోవా, ఎనిమిదో సీడ్‌ స్వియటెక్‌, 13వ సీడ్‌ నవోమి ఒసాక, 22వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ కూడా మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండి:

వాళ్లు ఓడలేదా?... భారత్‌పై పీసీబీ చీఫ్ నఖ్వీ అక్కసు

తిలక్‌ అదిరెన్‌!

Updated Date - Sep 04 , 2026 | 01:41 AM