Share News

వింబుల్డన్: యానిక్ సినర్ దూకుడు.. వరుసగా ఐదోసారి క్వార్టర్ ఫైనల్‌లోకి..

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:14 PM

టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 ప్లేయర్ యానిక్ సినర్ వింబుల్డన్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చూపించాడు. జపాన్ ప్లేయర్ షింటారో మోచిజుకిపై 6-3, 7-6, 6-3తో సునాయసంగా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నాడు.

వింబుల్డన్: యానిక్ సినర్ దూకుడు.. వరుసగా ఐదోసారి క్వార్టర్ ఫైనల్‌లోకి..
Jannik Sinner

ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 ప్లేయర్ యానిక్ సినర్ వింబుల్డన్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చూపించాడు. జపాన్ ప్లేయర్ షింటారో మోచిజుకిపై 6-3, 7-6, 6-3తో సునాయసంగా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నాడు. దీంతో వరుసగా ఐదోసారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆటగాడిగా సినర్ నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సినర్.. ఓపెన్ ఎరాలో వింబుల్డన్‌లో వరుసగా ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్స్ చేరిన 11వ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే ప్రస్తుతం ఈ ఘనత సాధించిన రెండో యాక్టివ్ ప్లేయర్‌గా నొవాక్ జకోవిచ్ తర్వాత సినర్ నిలిచాడు.


మ్యాచ్ ఆరంభంలో మోచిజుకి సర్వ్ బ్రేక్ పాయింట్ సాధించినా.. వెంటనే సినర్ దాన్ని తిప్పికొట్టాడు. ఆ తర్వాత జపాన్ ఆటగాడి సర్వీస్ గేమ్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను 33 నిమిషాల్లోనే సొంతం చేసుకున్నాడు. డో సెట్‌లో మోచిజుకి అటాక్ చేస్తూ ఆడాడు. వరుసగా మూడు సర్వీస్ గేమ్స్‌లో పాయింట్ కోల్పోకుండా నిలిచాడు. అయితే కీలక సమయంలో సినర్ మూడు బ్రేక్ పాయింట్లు వచ్చినా వాటిని వినియోగించుకోలేకపోయాడు. 4-4 వద్ద మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మోచిజుకి అద్భుతంగా ఆడి సినర్‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే టై బ్రేక్‌లో జపాన్ ఆటగాడు తప్పిదాలు చేయడంతో రెండో సెట్ కూడా సినర్ ఖాతాలోకి వెళ్లింది. ఆ తర్వాత దూకుడు పెంచి మూడో సెట్‌ను కూడా సినర్ సొంతం చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్‌: ట్రంప్ జోక్యం.. యూఎస్ ప్లేయర్‌పై నిషేధం ఎత్తివేత!

వింబుల్డన్ ఓపెన్: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్దలు

Updated Date - Jul 06 , 2026 | 12:32 PM