ఫిఫా ప్రపంచ కప్: పోర్చుగల్ నాకౌట్‌కు చేరాలంటే..
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:49 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో గ్రూప్-కే సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. డీఆర్ కాంగోపై 1-0 తేడాతో విజయం సాధించిన కొలంబియా 6 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది. అయితే ఈ ఫలితం పోర్చుగల్ జట్టుపై ప్రభావం చూపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో గ్రూప్-కే సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కాంగో డీఆర్‌పై 1-0 తేడాతో విజయం సాధించిన కొలంబియా 6 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది. అయితే ఈ ఫలితం పోర్చుగల్ జట్టుపై ప్రభావం చూపింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తోన్న పోర్చుగల్ జట్టు ఇంకా నాకౌట్ దశను ఖరారు చేసుకోలేదు. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన రొనాల్డో.. ఉజ్బెకిస్థాన్‌పై చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. మరి పోర్చుగల్ జట్టు నాకౌట్ చేరాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..
పోర్చుగల్ ప్రస్తుతం రెండు మ్యాచులు ఆడి 4 పాయింట్లతో గ్రూప్-కేలో రెండో స్థానంలో ఉంది. ఉజ్బెకిస్థాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ.. అగ్రస్థానంలో ఉన్న కొలంబియాను అధిగమించాలంటే పోర్చుగల్ రానున్న మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. రొనాల్డో జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 27న కొలంబియాతోనే తలపడనుంది. ఈ ఉత్కంఠ పోరులో విజయం సాధించిన జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుంది. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన కొలంబియాను.. పోర్చుగల్ జట్టు ఓడించగలిగితే నాకౌట్‌కు చేరుకోవడంతో పాటు గ్రూప్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకోవచ్చు. దీంతో కొలంబియా-పోర్చుగల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ పోరు గ్రూప్ దశలోనే హైవోల్టేజ్ మ్యాచ్‌గా మారింది.
డీఆర్ కాంగోకు అవకాశాలు..
కొలంబియాపై డీఆర్ కాంగో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ జట్టుకు నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఉజ్బెకిస్థాన్‌తో జరిగే తన తదుపరి మ్యాచ్‌లో డీఆర్ కాంగో విజయం సాధించాలి. ఇక ఉజ్బెకిస్థాన్ పరిస్థితి కూడా అదే తరహాలో ఉంది. డీఆర్ కాంగోపై గెలిస్తేనే నాకౌట్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇప్పటికే నాకౌట్ చేరిన కొలంబియా.. ఇప్పుడు గ్రూప్ టాప్ కోసం పోర్చుగల్‌తో జరిగే కీలక పోరుకు సిద్ధమవుతోంది. రొనాల్డో జట్టు ఈ మ్యాచ్‌లో ఎలా ఆడనుందో? అని ఫుట్‌బాల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇవి కూడా చదవండి:
మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్
ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు కొలంబియా