వినేశ్ ఫొగాట్‌కు అనుమతి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రెజ్లింగ్ సమాఖ్య
ABN , Publish Date - May 28 , 2026 | 06:07 PM
ఆసియా క్రీడలసెలక్షన్ ట్రయల్స్ 2026లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వును సవాల్ చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలసెలక్షన్ ట్రయల్స్ 2026లో పాల్గొనేందుకు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వును సవాల్ చేస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ జస్టిస్‌లు పి.ఎస్.నరసింహ, అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రాగా రేపు (శుక్రవారం) విచారణ జరగనుంది.
మే 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల నుంచి ఈ న్యాయ వివాదం మొదలైంది. ఆ ఉత్తర్వులో రాబోయే సెలక్షన్ ట్రయల్స్‌లో పోటీ చేయడానికి ఫొగాట్‌కు అనుమతి లభించింది. మే 30, 31 తేదీల్లో ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ జరగనున్నాయి. ఆసియా క్రీడల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిర్దేశించిన ఎంపిక ప్రమాణాలు వివక్షపూరితంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయించిన ప్రమాణాలు గత ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకునేలా లేవని వ్యాఖ్యానించింది.
ఎంపిక ట్రయల్స్ నుంచి వినేశ్ (Vinesh Phogat)ను మినహాయించడం ఆమె తీసుకున్న ప్రసూతి విరామానికి నేరుగా ముడిపడి ఉందని వెల్లడించింది. మే 9న వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ జారీ చేసిన షోకాజ్ నోటీసులో.. అధిక బరువుతో పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ అనర్హతకు గురికావడాన్ని దేశానికి అవమానం అని వ్యాఖ్యానించడంపై హైకోర్టు సీరియస్ అయింది. ట్రయల్స్‌లో వినేశ్ పాల్గొనేందుకు నిబంధనలు అంగీకరించవని డబ్ల్యూఎఫ్‌ఐ చేసిన వాదనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మే 30,31 తేదీలలో జరగనున్న ట్రయల్స్‌లో వినేశ్‌ను పాల్గొనేందుకు అనుమతించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, ట్రయల్స్‌ను WFI ద్వారా వీడియో రికార్డ్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్