హోర్ముజ్‌లో వాణిజ్యానికి భద్రత అత్యవసరం: అజిత్ డోభాల్
ABN , Publish Date - May 28 , 2026 | 05:48 PM
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్యానికి భద్రత కల్పించడం అత్యవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గురువారం పేర్కొన్నారు. మాస్కోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో డోభాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో వాణిజ్యానికి భద్రత కల్పించడం అత్యవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ గురువారం పేర్కొన్నారు. హోర్ముజ్‌తో పాటు ఎర్రసముద్రంలో కూడా వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని అన్నారు. మాస్కోలో (రష్యా) జరుగుతున్న ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్‌లో డోభాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ద్వంద్వ వైఖరి ఉండకూడదని కూడా అజిత్ డోభాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశాలు తమ చర్యలను సమీక్షించుకోవాలని చెప్పారు. ఉ
రెండో ప్రపంచయుద్ధం తరువాత ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థలు, వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను అధిగమించేలా ప్రభావశీలంగా మారాలని కోరారు. గ్లోబల్ సౌత్ దేశాలకు ఈ సంస్థల్లో మరింత ప్రాతినిధ్యం పెరగాలని కూడా చెప్పారు.
రష్యన్ ఫెడరేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగూ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటైంది. బహు ధ్రువ ప్రపంచంలో అంతర్జాతీయ భద్రతా సవాళ్లు అనే అంశంపై ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా డోభాల్, షోయిగూ గురు, శుక్రవారాల్లో దైప్వాక్షి సమావేశాల్లో కూడా పాల్గొంటారు.
ఈ వార్తలనూ చదవండి:
రైతుగా మారిన టెకీ.. పిడుగుపాటుకు గురై దుర్మరణం
కేరళంలో ఈడీ బృందంపై దాడి కేసు.. 8 మంది అరెస్టు