టీజీ20 లీగ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
ABN , Publish Date - Jun 16 , 2026 | 07:19 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా శ్రీనిధి యూనివర్సిటీ ఎంపికైంది. కాగా బుధవారం ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని హెచ్‌సీఏ నిర్వహించనుంది.
టీజీ20 లీగ్ విజేత జట్టుకు రూ.కోటి నగదు బహుమతి అందించనున్నారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.50 లక్షలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు హెచ్‌సీఏ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ లీగ్‌లో మ్యాచ్‌లన్నీ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి మ్యాచ్‌కు ముందు సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, లేజర్ షో ఉండనుంది. కాగా లీగ్‌లో ఎనిమిది జట్లు పోటీపడుతుండగా.. ప్రతి జట్టు మిగతా అన్ని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్ప ఐపీఎల్‌లోని అన్ని రూల్స్ ఈ లీగ్‌లో ఉండనున్నాయి.
ఇవి కూడా చదవండి:
సెరెనా విలియమ్స్ రీఎంట్రీ.. సోదరి వీనస్‌తో వింబుల్డన్‌లో బరిలోకి!
నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర.. పోలీసులకు గంగూలీ ఫిర్యాదు